Southwest Monsoon in Telangana : తెలంగాణలోకి ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు - HYDERABAD METEOROLOGICAL DEPARTMENT
Monsoon in Telangana : బిపోర్‌జాయ్ తుపాన్ కారణంగా నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం కొంత బలహీనపడినట్లు.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ నెల 19 వరకు నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దక్షిణ, కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు కేంద్రీకృతమైనట్లు పేర్కొంది. రుతుపవనాల ఆలస్యం వల్ల అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులు వీస్తున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వివరించింది. రాష్ట్రంలో నాలుగో రోజు నుంచి దక్షిణ, మధ్య తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుందని తెలిపారు. ఈశాన్య తెలంగాణ జిల్లాలైన నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం, హన్మకొండ, వరంగల్ జిల్లాలో తీవ్ర వడగాల్పులు వీస్తాయని వెల్లడించింది. ఈ క్రమంలోనే కుమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ములుగు, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశామని అన్నారు. ఇప్పుడు పత్తి, సోయా పంటలకు అనుకూల సమయం కాదని అంటున్న శ్రావణితో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి.