తెలంగాణ

telangana

imd

ETV Bharat / videos

IMD Director Interview : 'మూడు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు.. రెడ్​ అలర్ట్​ జారీ' - హైదరాబాద్​లో భారీ వర్షాలు

By

Published : Jul 25, 2023, 3:51 PM IST

Updated : Jul 25, 2023, 3:56 PM IST

Heaviest Rains In Next 3Days In Telangana : వాయువ్య బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏర్పడిన అల్ప పీడనం.. ఈరోజు ఉదయం తీవ్ర అల్ప పీడనంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ఉపరితలంగా ఉన్న అనుబంధ ఉపరితలం 7.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. మరొక ఉపరితలం మధ్యప్రదేశ్​ ప్రాంతంలో ఆవరించి ఉంది. రాగల 24గంటల్లో తీవ్ర అల్ప పీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ తీవ్ర అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, భారీ వర్షాలు కురవనున్నాయి. అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో ఈ మూడు రోజులు రెడ్ అలర్ట్ జారీ చేశామంటున్న నాగరత్నతో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

Last Updated : Jul 25, 2023, 3:56 PM IST

ABOUT THE AUTHOR

...view details