Telangana Weather Report : గుడ్న్యూస్.. వర్షాలు ఇక తగ్గుముఖం పట్టినట్లే! - హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం
IMD Director Dr. Nagaratnam Interview : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడితే తప్ప.. మరి వర్షాలు లేవు. ఇప్పటికి భారీ వర్షాలు తగ్గుముఖం పట్టినట్లే. తెలంగాణపై నైరుతి రుతు పవనాలు ఉద్ధృతంగా ఉన్నాయి. తాజాగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అతి పెద్ద వర్షాలుగా నమోదయ్యాయి. హనుమకొండ సహా ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కొన్ని చోట్ల అసాధారణమైన భారీ వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, భద్రాద్రి కొత్తగూడెం, కుమురం భీం జిల్లాల్లో అక్కడక్కడా అత్యంత భారీ వర్షం కురిసింది. ఆగస్టు రెండో వారం, సెప్టెంబరులో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయి. తీవ్ర అల్పపీడనం అల్పపీడనంగా బలహీనపడి ప్రస్తుతం దక్షిణ ఒడిశా, పరిసరాల్లో ఉత్తర ఆంధ్రప్రదేశ్ వద్ద కొనసాగుతోంది. శుక్రవారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 29, 30, 31వ తేదీల్లో ఎలాంటి హెచ్చరికలు లేవంటున్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె.నాగరత్నతో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి..