సాయినాథుడికి 15 తులాల బంగారు హారాన్ని బహుకరించిన ఐఏఎస్ భార్య - undefined
భర్త చివరి కోరిక మేరకు తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన ఓ ఐఏఎస్ భార్య.. మహారాష్ట్రలోని షిరిడీ సాయినాథుడికి బంగారు హారాన్ని బహుకరించింది. హైదరాబాద్‌కు చెందిన పోలవర్ణం.. బంగాల్లోని ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వర్తిస్తూ కరోనా సమయంలో మరణించారు. అయితే భర్త చివరి కోరిక మేరకు కల్యాణి పోలవర్ణం తన మెడలోని బంగారు మంగళసూత్రాన్ని బంగారు హారంగా తయారు చేయించారు. శుక్రవారం షిరిడీ సాయి సంస్థాన్ ట్రస్ట్ సభ్యులకు ఆమె బంగారు హారాన్ని అందజేశారు. దాని విలువ రూ.7 లక్షలు ఉంటుందని సంస్థాన్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST