తెలంగాణ

telangana

jharkhand ias transfer

ETV Bharat / videos

ప్యూన్ కాళ్లు మొక్కిన జిల్లా కలెక్టర్​.. ట్రాన్స్​ఫర్​పై వెళ్తూ.. తనకు సేవ చేశారని.. - ఝార్ఖండ్ ఐఏఎస్ అధికారుల బదిలీలు

By

Published : Jul 29, 2023, 11:19 AM IST

ఝార్ఖండ్​లో ఓ ఐఏఎస్ అధికారి బదిలీ సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన ఆఫీసులో పనిచేసిన ప్యూన్​ కాళ్లకు మొక్కి.. ఆశీర్వాదం తీసుకున్నారు. మరో ఇద్దరు ప్యూన్లకు శాలువాలు కప్పి చిరు సత్కారం చేశారు.  

పాలమూ జిల్లా కలెక్టర్​గా పనిచేసిన దొడ్డే దుమ్కా జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో పాలమూ కలెక్టర్​గా శశిరంజన్ నియమితులయ్యారు. ఈ క్రమంలో దొడ్డే నుంచి శశిరంజన్​ పలామూ కలెక్టర్​గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు శశిరంజన్​కు అప్పగించిన తర్వాత దొడ్డే తన దగ్గర పనిచేసే నందలాన్ అనే ప్యూన్​ వద్దకు వెళ్లి ఎమోషనల్ అయ్యారు. ఆయన కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. తన తండ్రి కూడా ప్యూన్​గా పనిచేశారని గుర్తు చేసుకున్నారు. తాను కలెక్టర్​గా ఉన్న సమయంలో నందలాల్ తనకు ఎంతో సేవ చేశారని ఐఏఎస్ అధికారి దొడ్డే తెలిపారు. 'పలామూ జిల్లా కలెక్టర్​గా పనిచేసినప్పుడు చాలా అనుభవాలు పొందాను. జిల్లాలో పరిపాలనా యంత్రాంగం బాగుందని.. అభివృద్ధికి కృషి చేస్తోంది. పలామూ కొత్త కలెక్టర్​గా బాధ్యతలు స్వీకరించిన శశిరంజన్​కు శుభాకాంక్షలు' అని తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details