Hyderabad Steel Bridge Drone visuals : ప్రజారవాణాలో మరో మైలురాయి.. హైదరాబాద్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధమైన స్టీల్‌బ్రిడ్జి - Hyderabad route map
Hyderabad Steel Bridge Inauguration Ceremony : ప్రజా రవాణాలో హైదరాబాద్ మరో మైలురాయి చేరనుంది. ఇందిరా పార్కు వద్ద నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు. 2.63 కిలోమీటర్ల పొడవైన ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ స్టాటజిక్ రోడ్డు డెవలప్మెంట్ ప్రోగ్రాం(SRDP)లో భాగంగా చేపట్టారు. సుమారు రూ.450 కోట్లతో నిర్మించిన పొడవైన స్టీల్ బ్రిడ్జికి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి, రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి హోంశాఖ మంత్రిగా పనిచేసిన నాయిని నరసింహారెడ్డి పేరు పెట్టారు. ఇందిరా పార్క్ అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు మీదుగా ఉస్మానియా యూనివర్సిటీ, తార్నాక, అంబర్ పేట్, ఉప్పల్‌కు వెళ్లాలంటే ట్రాఫిక్ ఇబ్బందులతో ఎన్నో బాధలు పడేవారని ఈ ఫ్లై ఓవర్‌తో ట్రాఫిక్ ఇబ్బంది తొలగిపోనున్నాయి. ఇందిరా పార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు మీదుగా 4 జంక్షన్లకు ఈ ఫ్లై ఓవర్‌తో ట్రాఫిక్ సమస్య ఇక తప్పనుంది.