Foreign Universities Scholarships : ఇలా చేస్తే కోరుకున్న వర్సిటీలో స్కాలర్‌షిప్ పక్కా..!
Foreign Universities Scholarships : విదేశాల్లో ఉన్నత విద్యను చదివి కెరీర్‌ను అద్భుతంగా తీర్చి దిద్దుకోవాలనే అభిలాష ఎంతో మంది విద్యార్థులకు ఉంటుంది. విదేశాల్లో విద్య అంటే.. రూ.లక్షలతో కూరుకున్న వ్యవహారం. ఆర్థికంగా వెనకబడిన వారికి విదేశీ విద్యాలయాలు స్కాలర్షిప్లు అందజేస్తున్నాయి. స్కాలర్షిప్ను పొందాలంటే మాత్రం ముందు నుంచే సరైన ప్రణాళిక అవసరం అంటుంది ఈ విద్యార్థి. కానీ ఎలా ముందుకు వెళ్లాలో తెలియక చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటారు. అయితే సరైన ప్రతిభ, నైపుణ్యాలు ఉంటే కోరుకున్న యూనివర్సిటీలో స్కాలర్‌షిప్ సాధించడం కష్టమేం కాదంటోంది విద్యార్థిని సాయిప్రియ వల్లభి.
విదేశీ విద్యాలయాల నుంచి స్కాలర్‌షిప్ ఎలా సాధించాలో కూడా చెబుతోంది. ఇటీవలె ఉన్నత చదువు కోసం విదేశాలకు వెళ్లిన తను.. 5 ప్రతిభ ఆధారిత స్కాలర్‌షిప్‌లకు ఎంపికైంది. లక్ష్యం కోసం పరితపించే విద్యార్థులకు అనేక అవకాశాలు ఉన్నాయని.. అందుకు తన సక్సెస్ జర్నీనే ఉదాహరణగా చెబుతోంది. ఆ విశేషాలు తన మాటల్లోనే తెలుసుకుందాం.