Jagan Illegal Assets Case: జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ వేగవంతం
CBI Court Hearing Jagan Illegal Assets Case: హైదరాబాద్లోని సీబీఐ కోర్టు ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో వేగం పెంచింది. నాంపల్లి సీబీఐ కోర్టు.. శుక్రవారం జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ చేపట్టింది. డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు జులై 31నాటికి పూర్తి చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. సీబీఐ ఛార్జిషీట్లలో నిందితుల డిశ్చార్జి పిటిషన్లపై విచారణ చేపట్టగా.. ఎనిమిది ఛార్జిషీట్లలో విచారణ ముగిసింది. మరో 3 ఛార్జిషీట్లలో డిశ్చార్జి పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. అంతేకాకుండా ఈడీ 7 ఛార్జిషీట్లలో డిశ్చార్జి పిటిషన్లపై విచారణ సైతం ముగియగా.. మరో 2 ఛార్జిషీట్లలో డిశ్చార్జి పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. దీంతో జులై 31 నాటికి డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు ముగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుపై ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్షాలు ప్రశ్నల వర్షం కురిపించాయి. ఇతర కేసుల్లో విచారణలు త్వరగా జరుగుతున్నా.. జగన్ అక్రమాస్తుల కేసుల్లో అలా ఎందుకు జరగటం లేదని ఆరోపణలు చేశాయి.