మరోసారి రాష్ట్రంలో వడగళ్ల వర్షాలు.. బీ అలర్ట్! - వాతావరణ పరికరాలు పదర్శణ
Hyderabad Meteorological Center: రానున్న మరో ఐదు రోజులు రాష్ట్రంలో వడగాళ్లలతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడతాయని.. ఈనెల 25, 26,27 తేదీల్లో వడగళ్ల వర్షాలు మరోసారి పడొచ్చునని వాతావరణ శాఖ అంచానా వేస్తోంది. ఇలా ప్రతికూల సమయాల్లో హెచ్చరికలు జరీ చేస్తూ.. అనుకూల పరిస్థితుల్లో సూచనలు చేస్తూ ప్రజలను ఎప్పటికప్పుడు వాతావరణ అప్రమత్తం చేస్తోంది. వాతావరణం మీద ఆధారపడే దేశాభివృద్ధి, మానవాళి మనుగడ ఉంటుంది. ప్రకృతి వైఫరీత్యాలపై నిత్యం అధ్యయనం చేస్తూ తగు జాగ్రత్తలు చెబుతుంది. ఆపద ముంచుకొచ్చే సమయంలో అప్రమత్తం చేస్తోంది. ప్రపంచ వాతావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం భవిష్యత్తు తరాలకు వాతావరణం గురించి చాటిచెప్పాలనే ఉద్ధేశ్యంతో వాతావరణ పరికరాల ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ఈ ప్రదర్శనకు సంబంధించిన మరింత సమాచారంతో పాటుగా ప్రకృతి విపత్తులు, వడగళ్ల వర్షాలు, పిడుగులు పడేటప్పుడు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అనే దానిపై వాతావరణ శాఖ నిపుణులు ఏం అంటున్నారో ఇప్పుడు చూద్దాం..!