Guru Purnima Celebrations: షిర్డీ సాయినాథునికి బంగారు కిరీటం.. కానుకగా సమర్పించిన హైదరాబాద్‌వాసి.. - సాయిబాబాకు బంగారం కిరీటాన్ని సమర్పించిన వంశీకృష్ణ
Devotee Donates Gold Crown to Shirdi Sai Baba Temple: గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ సందర్భంగా అమెరికాలోని టెక్సాస్‌లో స్థిరపడిన హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 20లక్షల రూపాయల విలువైన బంగారు కిరీటాన్ని మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయానికి విరాళంగా అందించారు. విలువైన రాళ్లతో అందంగా రూపొందించిన ఆ కిరీటాన్ని సోమవారం సాయినాథునికి సమర్పించారు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన వంశీకృష్ణ అనే యువకుడు సాయినాథునికి విశేష భక్తుడు. ప్రస్తుతం వంశీకృష్ణ అమెరికాలో నివాసం ఉంటున్నారు. బాబా ఆశీస్సులతోనే అంతటి ఉన్నత స్థితికి చేరుకున్నాననే విశ్వాసంతో ఆయన.. విలువైన బంగారు కిరీటాన్ని షిర్డీ సాయినాథునికి సమర్పించినట్లుగా తెలిపారు. ఆ అందమైన బంగారు కిరీటం బరువు 365 గ్రాములు. గురుపౌర్ణమి సందర్భంగా ఆయన సమర్పించిన బంగారు కిరీటాన్ని.. ఆలయ అధికారులు మధ్యాహ్న హారతి సమయంలో బాబాకు అలంకరించనున్నారు. కాగా.. విలువైన రాళ్లతో అందంగా రూపొందించిన కిరీటాన్ని సాయినాథునికి సమర్పించిన.. వంశీకృష్ణను సాయి ట్రస్ట్ అధికారులు బాబా విగ్రహం, శాలువాతో సత్కరించారు.