తెలంగాణ

telangana

Hyderabad Collector Anudeep Interview

ETV Bharat / videos

రేపు ఉదయం 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం - కలెక్టర్ అనుదీప్ ఇంటర్వ్యూ

By ETV Bharat Telangana Team

Published : Dec 2, 2023, 5:26 PM IST

Hyderabad Collector Anudeep Interview : రేపు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్​కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్​తో పాటు జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్‌ కౌంటింగ్ కేంద్రాల్లోని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 

Telangana Election Results 2023 : రేపు ఆదివారం ఉదయం 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ పేర్కొన్నారు. ఆదివారం జరగబోయే ఎన్నికల కౌంటింగ్​లో భాగంగా హైదరాబాద్​, సికింద్రాబాద్ నియోజకవర్గాల స్ట్రాంగ్ రూం వద్ద కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సాయిధ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం వెబ్ క్యాస్టింగ్ జరుగుతుందన్నారు. ప్రతి రౌండ్ ఫలితాన్ని కౌంటింగ్ ఏజెంట్లు, మీడియా సమక్షంలో తెలపడం జరుగుతుందన్నారు. ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ కౌంటింగ్ పూర్తవుతుందని అంటున్న హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్​తో మా ప్రతినిధి ముఖాముఖి. 

ABOUT THE AUTHOR

...view details