Hussain Sagar Water Level Today: నిండుకుండలా హుస్సేన్‌సాగర్.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే - Hussain Sagar Water Level Today
Hussain Sagar Water Level Today in Hyderabad : రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాల వల్ల వాగులు, చెరువులు, జలాశయాలు అన్నీ జలకళను సంతరించుకున్నాయి. వరదల కారణంగా ప్రాజెక్టులన్నీ దాదాపు నిండిపోయాయి. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ సైతం నిండుకుండలా మారింది. ఎగువ నుంచి భారీ ఎత్తున వరద నీరు రావడంతో పూర్తిగా నిండింది. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున.. హుస్సేన్ సాగర్ తూము గేట్లను అధికారులు ఎత్తారు. నీటిని దిగువ ప్రాంతాలకు తరలిస్తున్నారు. అందువల్ల లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 మీటర్లు కాగా.. 4 తూముల నుంచి అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తున్నందున నీటి మట్టం పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలన చేస్తున్నారు. నిండుగా నీరు ఉన్నందున హుస్సేన్ సాగర్ పర్యాటకులకు కనువిందు చేస్తోంది.