భార్య తల నరికిన భర్త - వివాహేతర సంబంధం అనుమానంతో దారుణం - Husband Killed his Wife Rangareddy
Published : Jan 16, 2024, 7:27 PM IST
Husband Killed his Wife Brutally at Abdullapurmet: ఓ భర్త తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఘోరానికి ఒడిగట్టాడు. ఆమెను దారుణంగా నరికి చంపేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో జరిగింది.
వనస్థలిపురం ఏసీపీ బీంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఓ భర్త తన భార్యను కిరాతకంగా హత్య చేశాడు. జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో భార్య పుష్పలతను భర్త విజయ్ అతి కిరాతంగా తల నరికేశాడు. వివాహేతర సంబంధం అనుమానంతో భార్యను నిందితుడు విజయ్ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారు నివాసం ఉంటున్న బ్లాక్‌కు పక్కనే కొత్తగా నిర్మించిన మరో బిల్డింగ్‌లోని బ్లాక్‌లోకి భార్యను తీసుకెళ్లి పదునైన కత్తితో తలను, మొండాన్ని వేరు చేశాడని వనస్థలిపురం ఏసీపీ బీంరెడ్డి తెలిపారు. పుష్పలతకు గతంలో రెండు పెళ్లిళ్లు జరిగాయని స్థానికులు పోలీసులకు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరిలించారు.