తెలంగాణ

telangana

జగిత్యాల జిల్లాలో ఆలయ హుండీ చోరి

ETV Bharat / videos

ఆలయాల్లో హుండీ చోరీ - సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు - సాయిబాబా ఆలయ చోరి కేసు

By ETV Bharat Telangana Team

Published : Nov 18, 2023, 2:50 PM IST

Hundi Theft At Saibaba Temple In Jagtial District : జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలోని సాయిబాబా, రాజరాజేశ్వర స్వామి దేవాలయాల్లో శనివారం వేకువ జామున గుర్తు తెలియని వ్యక్తి దోపిడీకి పాల్పడ్డాడు. గ్రామ శివారులో ఉన్న రెండు ఆలయాల్లో అర్ధరాత్రి దాటాక ఆలయాల ప్రహరీ గోడలు దూకి వెంట తెచ్చుకున్న ఆయుధంతో కిటికీని విరగ్గొట్టాడు. లోపలికి దూరి గునపంతో హుండీలను పగులగొట్టి అందులో ఉన్న కానుకలను ఎత్తుకెళ్లాడు .  

Hundi Stolen Temple Metpally: ఆలయానికి వెనుక వైపున ధ్వంసమైన హుండీని స్థానికులు గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు. దొంగతనం చేస్తున్న దృశ్యాలు ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో నిక్షిప్తం అయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. రెండు ఆలయాల్లో దొంగతనం చేసిన వ్యక్తి ఒక్కడా.. ఇద్దరా.. అనే కోణంలో  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details