Huge Tree Collapse At Assembly Canteen : మొన్న హైదర్‌గూడ, నేడు అసెంబ్లీ ప్రాంగణం.. నేలకొరిగిన భారీ వృక్షం.. కొద్దిలో..! - నేలకూలిన భారీ వృక్షం
Published : Sep 22, 2023, 5:39 PM IST
Huge Tree Collapse At Assembly Canteen :హైదరాబాద్ అసెంబ్లీ క్యాంటీన్ ముందు ఉన్న భారీ వృక్షం(Tree Collapse) నేలకొరిగింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా చెట్టు పడిపోయింది. క్యాంటీన్లో తినడానికి వచ్చిన వారు.. వాహనాలను చెట్టు కింద పార్క్ చేసి వెళ్లారు. దీంతో ఆ చెట్టు.. నిలిపి ఉన్న రెండు ద్విచక్ర వాహనాలపై పడింది. అమాంతం చెట్టు పడటంతో వాహనాలు ధ్వంసమయ్యాయి.
Huge Tree Fell Down in Hyderabad : ఒక్కసారిగా భారీ శబ్దంతో కూలిపోవడంతో.. చెట్టు కింద ఉన్న వ్యక్తులు భయంతో పరుగులు తీశారు. తృటిలో ముగ్గురు వ్యక్తులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీంతో అక్కడ ఉన్న వారు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవలే హైదర్‌గూడలో భారీ వృక్షం కూలీ ఆటో డ్రైవర్ మృతి చెందిన విషయం మరువక ముందే ఈ సంఘటన జరగడంతో.. ఎప్పుడు ఏం అవుతుందో అని భాగ్యనగర వాసుల్లో ఆందోళన నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న జీహెచ్ఎంసీ(Greater Hyderabad Municipal Corporation) డీఆర్ఎఫ్ సిబ్బంది.. చెట్టును తొలగించారు.