Huge Python at Yellandu : అమ్మబాబోయ్ కొండచిలువ.. భయం లేకుండా భలే పట్టేసుకున్నారే..? - ఇల్లందు మండలం రొంపేడు గ్రామంలో కొండచిలువ కలకలం
Huge Python at Yellandu :సహజంగా ఎక్కడైనా పాములు కనిపిస్తే భయంతో పరుగులు పెడుతుంటాం.. ఇక ఇళ్లలోకి ప్రవేశిస్తే అంతే సంగతులు. చాలా ప్రాంతాల్లో చిన్న పాములనైనా సరే.. అపాయకరమని భావించి వాటిని చంపుతుంటారు. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రొంపేడు గ్రామస్థులు.. ఇళ్లలోకి ప్రవేశించిన భారీ కొండచిలువను పట్టుకొని అటవీశాఖ సిబ్బందికి అప్పజెప్పారు.
Giant Python at Rompedu Village :రొంపేడు గ్రామంలో.. గత కొన్ని రోజులుగా కోడి పిల్లలు మాయమవుతున్నాయి. ఒకరోజు కోడిపిల్లలను తినడానికి వచ్చిన భారీ కొండచిలువను స్థానికులు గుర్తించారు. భయంతో వెంటనే అది గడ్డివాములోకి వెళ్లింది. పది అడుగులున్న దానిని.. గ్రామస్థులు శ్రమించి క్షేమంగా పట్టుకుని బస్తాలో వేసి అటవీ అధికారులకు అప్పగించారు. ఏజెన్సీ ప్రాంతాలుగా ఉన్న ఇల్లందు, గుండాల, అల్లపల్లి మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో.. పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఇళ్లలోనికి వచ్చిన పాములను.. ఎటువంటి హాని తలపెట్టకుండా వాటిని అటవీ ప్రాంతంలో వదిలేలా.. రొంపేడు గ్రామస్థులు వ్యవహరించిన తీరు స్ఫూర్తిదాయకంగా నిలిచింది.