Huge People visiting Telangana Secretariat : వారాంతాల్లో కొత్త సచివాలయ పరిసర ప్రాంతాల్లో సందర్శకుల సందడి - hyderabad latest news
Published : Oct 2, 2023, 1:52 PM IST
Huge People Visiting Telangana Secretariat: వారాంతాల్లో హుస్సేన్‌సాగర్, నూతన సచివాలయ పరిసరాలు సరికొత్త శోభను సంతరించుకుంటున్నాయి. సాగర్ పరిసరాలు సహా అంబేద్కర్ విగ్రహం, అమరుల స్మారక స్ధూపం, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ పార్క్, నెక్లెస్‌రోడ్, ట్యాంక్ బండ్ ఇలా అన్నీ ప్రాంతాలకు సందర్శకుల తాకిడి పెరుగుతోంది. ఇంకా సెలవు రోజుల్లో సందర్శకుల రాక చెప్పాల్సిన అవసరం లేదు. శని, ఆదివారాల్లో జనాలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అర్థరాత్రి వరకు కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతున్నారు.
అన్నీ రకాలైన తిను బండారాలు సైతం లభ్యం కావడంతో వీక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో డబ్బులు పెట్టి పార్క్‌లను చూసే వాళ్లమని... ఇప్పుడు ఎలాంటి టికెట్ లేకుండానే సచివాలయంతో పాటు అమరుల స్తూపం, అంబేద్కర్ విగ్రహాలను వీక్షిస్తున్నామని అంటున్నారు. వీటితోపాటు పార్క్ లాగే విశాలమైన స్థలం ఉండటంతో కుటుంబ సమేతంగా కాసేపు ఉల్లాసంగా గడిపేందుకు వీలవుతుందని సందర్శకులు అంటున్నారు. చరవాణిలో మధుర జ్ఞాపకాలను పదిలం చేసుకుంటున్నారు.