తెలంగాణ

telangana

Huge Monolith for Hanuman Statue in Hindupur

ETV Bharat / videos

Huge Monolith for Hanuman Statue in Hindupur ఆంజనేయ విగ్రహం కోసం హిందూపురం చేరుకున్న 500 టన్నుల భారీ ఏకశిల

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2023, 4:15 PM IST

Huge Monolith for Hanuman Statue in Hindupur: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో 44 అడుగుల ఏకశిల ఆంజనేయ విగ్రహం ఏర్పాటు కోసం తీసుకువచ్చిన శిలను భారీ వాహనంలో ఊరేగించారు. 500 టన్నుల బరువున్న ఈ ఏకశిలను 120 చక్రాల ప్రత్యేక వాహనంపై పట్టణంలోకి తీసుకొచ్చారు. హిందూపురం పట్టణంలోని సుగురు ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఏకశిలా విగ్రహం ఏర్పాటు కోసం తీసుకువచ్చిన ఈ శిలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిర్వాహకులు శోభాయాత్ర ప్రారంభించారు. ప్రత్యేకంగా అలంకరించిన భారీ వాహనంలో జై హనుమాన్, జై శ్రీరామ్ అంటూ శ్రీరాముని నామ స్మరణల మధ్య శోభాయాత్ర కొనసాగింది. పరిగి రోడ్డులోని కంచి కామాక్షి ఆలయం నుంచి సుగురు ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణం వరకు ఈ యాత్ర జరిగింది. హిందూపురంకి నైరుతిలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో 44 అడుగుల ఏకశిలా ఆంజనేయ స్వామి విగ్రహ ఏర్పాటు పట్టణానికి తలమానికం కానుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విగ్రహ ఏర్పాటు కోసం పట్టణంలోని కాంట్రాక్టర్ చంద్రశేఖర్ కర్ణాటక రాష్ట్రం మధుగిరి కొండల నుంచి సొంత నిధులతో ఈ శిలను తీసుకొచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details