తెలంగాణ

telangana

FIRE ACCIDENT

ETV Bharat / videos

FIRE ACCIDENT: ఒక్క సిగరెట్​తో రూ. 5 లక్షల ఆస్తి నష్టం.. మీరే చూడండి? - హైదరాబాద్​లో భారీ అగ్ని ప్రమాదం

By

Published : Apr 27, 2023, 3:50 PM IST

రోడ్డు పక్కనే అక్రమంగా డీజిల్​, పెట్రోల్​ అమ్ముతున్న షాపులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ మంటల తాకిడికి మెకానిక్​ షెడ్​లోని కారు, ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్​లోని బోరబండలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండలోని బస్తీ లేబర్​ అడ్డాలో మహ్మద్​ లతీక్​ అనే వ్యక్తి మెకానిక్​ షెడ్​ నడుపుతున్నాడు. అంతేకాకుండా పెట్రోల్​, డీజిల్​ను క్యాన్లలో తెచ్చి విడిగా అమ్ముతాడు. 

గురువారం మధ్యాహ్నం తన కారులో తెచ్చిన పెట్రోల్​, డీజిల్​లను క్యాన్లలో నింపే క్రమంలో.. సిగరెట్​ అంటించాడు. ఒక్కసారిగా పెట్రోల్​ ఉన్న బాటిల్​కు ఆ నిప్పు అంటుకుని భారీగా మంటలు ఎగసిపడ్డాయి. అతను ప్రాణాలతో బయటపడ్డాడు.. కాని కారుతో సహా మొత్తం మెకానిక్​ షెడ్​ అందులోని ఐదు లక్షలు విలువ చేసే ద్విచక్ర వాహనాలు, ఆటో పూర్తిగా కాలిపోయాయి. ఆ షాపు పక్కనే ఉన్న చికెన్​ షాపు సైతం పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం అందించడంతో.. సకాలంలో మంటలు అదుపు చేయడంతో భారీ ప్రమాదమే తప్పినట్లు అయ్యింది.

ABOUT THE AUTHOR

...view details