తెలంగాణ

telangana

Devotees Increase at Yadadri Temple

ETV Bharat / videos

Huge Devotees in Yadadri Temple : యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి రెండు గంటలు - telangana devotional news

By ETV Bharat Telangana Team

Published : Sep 17, 2023, 5:40 PM IST

Huge Devotees in Yadadri Temple: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో రాష్ట్రంలోని నలుమూలల నుంచి.. ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. లడ్డు ప్రసాదం కౌంటర్లు, నిత్యా కల్యాణం(Nitya Kalyanam), కొండ కింద కల్యాణ కట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడితో ఆహ్లద వాతావరణం నెలకొంది. 

Crowd of devotees in Yadadri Temple: స్వామి వారిని దర్శించుకునేందుకు ప్రత్యేక దర్శనం కోసం టికెట్లు కొనుకున్న వారికి సుమారు గంట సేపు క్యూలో ఉండాల్సి వస్తోందని భక్తులు చెప్పారు. ఉచిత దర్శనం ద్వారా దర్శనం చేసుకునే భక్తులు దాదాపు రెండు గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులకి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details