రాష్ట్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు - 570 కోట్ల విలువైన సొత్తు సీజ్ - ఎంత బంగారం ఈసీ స్వాధీనం చేసుకుంది
Published : Nov 15, 2023, 9:05 AM IST
Huge Amount Of Money Seized in Telangana During Election Code : శాసనసభ ఎన్నికల తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం, మద్యం, బహుమతుల మొత్తం విలువ రూ.571 కోట్లు దాటింది. అక్టోబర్ తొమ్మిదో తేదీ నుంచి ఇప్పటి వరకు రూ.571.80 కోట్లకు పైగా నగదు, ఆభరణాలు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్(Vikash Raj on Seized Amount in Telangana) తెలిపారు. గడచిన 24 గంటల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం రూ.12.88 కోట్లకు పైగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇప్పటివరకు 198కోట్ల 30 లక్షలకు పైగా నగదు, 178కోట్ల 81 లక్షలకు పైగా విలువైన ఆభరణాలు, 85కోట్ల పైచిలుకు మద్యం సీజ్ చేసినట్లు వికాస్ రాజ్ తెలిపారు. 32కోట్ల 43లక్షల విలువైన డ్రగ్స్ పట్టుబడినట్లు వెల్లడించారు. 76కోట్ల 49లక్షలకు పైగా విలువైన బియ్యం, కుక్కర్లు, చీరలు, సహా ఇతరత్రా కానుకలను స్వాధీనం చేసుకున్నారని వివరించారు.