తెలంగాణ

telangana

stomach bloating reasons

ETV Bharat / videos

కడుపులో గ్యాస్​తో ఇబ్బందులా? పొట్ట ఉబ్బరంగా ఉందా? ఈ చిట్కాలతో చెక్​!

By

Published : Jun 5, 2023, 5:16 PM IST

Stomach Bloating Reasons : కడుపులో పేరుకునే గ్యాస్‌తో ఎంతోమంది ఇబ్బంది పడుతుంటారు. సాధారణంగా నోటితో గాలిని పీల్చుకోవటం, ఆహారం జీర్ణమయ్యే సందర్భాల్లో కడుపులో గ్యాస్‌ పేరుకుపోతుంటుంది. ఇది బయటకు రావటానికి ప్రయత్నించటం వల్లే తేన్పులు వస్తుంటాయి. కానీ, కొన్నిసార్లు ఈ గ్యాస్‌ జీర్ణాశయం, పేగుల్లోనే ఉండిపోయి కడుపు ఉబ్బరం, నొప్పికి దారి తీస్తుంది. తరచుగా తేన్పులు, ఆవలింతలతో చికాకు కలిగిస్తుంది. వీటి నుంచి తప్పించుకోవాలంటే.. గ్యాస్‌ పేరుకుపోవటానికి గల కారణాలు, తగ్గించుకోవటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

మారిన జీవనశైలి నేపథ్యంలో సమయానికి ఆహారం తీసుకోకపోవడం, తీవ్ర మానసిక ఒత్తిడి, ఆందోళన, రాత్రి వేళ సరిగ్గా నిద్రపోకపోవడం, మసాలా ఎక్కువ ఉన్న ఆహారం వల్ల కడుపులో గ్యాస్ సమస్యలు ఏర్పడతాయని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ టి. లక్ష్మీకాంత్ తెలిపారు. ఈ గ్యాస్​ వల్లే అజీర్తి, కడుపులో మంట, కడుపు నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని ఆయన చెప్పారు. 'సరైన ఆహారం ఎంచుకోవాలి. మసాలా ఉన్న ఆహారం, కూల్​డ్రింక్స్​లకు దూరంగా ఉండాలి. మితంగా సమయానికి ఆహారం తింటే కడుపు ఉబ్బరం నుంచి బయటపడొచ్చు. కార్బొహైడ్రేట్ తక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. సమయానికి నిద్ర పోవడం, నీరు ఎక్కువగా తాగడం వల్ల కడుపు ఉబ్బరాన్ని తగ్గించుకోవచ్చు. పాల పదార్థాలు, పండ్లు వంటి వాటిల్లోని చక్కెర (గ్లుటెన్‌) పూర్తిగా జీర్ణం కాకపోవటం వల్ల కూడా గ్యాస్‌ పేరుకుంటుంది. ఇలాంటివి గమనిస్తే సాధ్యమైనంత వరకు గ్యాస్‌కు కారణమవుతున్న పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.' అని లక్ష్మీకాంత్​ తెలిపారు. మరిన్ని చిట్కాలు కోసం ఈ వీడియో చూడండి.  

ABOUT THE AUTHOR

...view details