Hospitals Full With Viral Fever Patients : జ్వరాలతో జర జాగ్రత్త.. ఒక్క ఫీవర్ ఆస్పత్రికే రోజూ 700 వరకు కేసులు - telangana health bulletin
Published : Sep 19, 2023, 5:20 PM IST
Hospitals Full With Viral Fever Patients : రాష్ట్రంలో విషజ్వరాలతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో ఫుడ్ పాయిజన్ కేసులు సైతం పెరుగుతున్నట్టు సమాచారం. మరోవైపు డెంగీ, టైఫాయిడ్‌తో ఆస్పత్రుల వద్ద రోగులు బారులు తీరుతున్నారు. ఒక్క ఫీవర్ ఆస్పత్రికే నిత్యం దాదాపు 700 వరకు ఓపీ కేసులు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.
Precautions To Be Taken To Prevent Fever : వానాకాలంలో జ్వరాలు ఎక్కువ రావడానికి దోమకాటు, కలుషితమైన తిండి, నీళ్లు వీటివల్ల మలేరియా, డెంగీ, చికన్‌గున్యా, వైరల్ ఫీవర్స్ వస్తాయని డాక్టర్లు చెపుతున్నారు. ఇలా రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంటి చుట్టుపక్కల వర్షం నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అలాగే ఓపెన్ డ్రైనేజీ లేకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా నీరు కలుషితం కాకుండా చూసుకోవాలి. ఇంట్లో దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పరిసరాల్లో తరచూ ఫాగింగ్ చేయించాలి. ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినాలి. కాచి చల్లార్చిన నీరు తాగాలి. కూరగాయలు, పండ్లు, నట్స్ వంటివి ఎక్కువగా తినాలి.
'' గత కొన్ని రోజుల నుండి టైఫాయిడ్, డెంగీ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. వర్షాలు పడటం వల్ల నీరు కలుషితమై వైరల్ ఫీవర్స్ వస్తాయి. మూడు రోజుల కన్నా ఎక్కువ రోజులు జ్వరం ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.''-ఆసుపత్రి ఆర్ఎంఓ