తెలంగాణ

telangana

రాజస్థాన్​లో గన్​పౌడర్​తో హోలీ పండుగ

ETV Bharat / videos

తుపాకీ కాల్పులతో హోలీ వేడుక.. దీపావళి పండుగను తలపించేలా..

By

Published : Mar 9, 2023, 12:48 PM IST

మనదేశంలో వింతలు విడ్డూరాలకు కొదవలేదు. ఏ మూలకు వెళ్లినా ఓ వింత ఆచారం మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతంది. అయితే రాజస్థాన్​లోని ఉదయ్​పుర్​ జిల్లాలో కూడా ఎవరూ జరుపుకోని విధంగా హోలీ పండుగను చేసుకుంటుంటారు ప్రజలు. అందరిలాగా రంగులతో కాకుండా గన్​పౌడర్​తో హోలీ పండుగను నిర్వహించుకుంటారు. జిల్లాకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెనార్​ గ్రామస్థులు ఈ వేడుకను చేస్తారు. దీనిని ప్రతి సంవత్సరం హోలీ తర్వాతి రోజున నిర్వహిస్తారు. వేడుకల్లో భాగంగా తుపాకుల్లో గన్​పౌడర్​ను నింపి గాల్లోకి కాల్పులు జరుపుతారు. అంతేగాక, పెద్ద ఎత్తున బాణాసంచాను కూడా కాలుస్తారు. ఈ కార్యక్రమంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ పాల్గొంటారు. ఈ సంబరాలను చూస్తుంటే ఇది హోలీ పండగా లేదా దీపావళా అని అనిపిస్తుంది. అయితే ఈ విధంగా హోలీని జరుపుకోవడం వెనుక ఓ చారిత్రక కారణం ఉందని చెబుతున్నారు స్థానికులు. ఈ గ్రామ ప్రజల పూర్వీకులు అప్పట్లో మొఘల్​ చక్రవర్తులతో పోరాడి గెలిచేందుకు చేసిన ప్రయత్నాలకు గుర్తుగా దీనిని నిర్వహిస్తామని అంటున్నారు. సుమారు 500 ఏళ్ల నుంచి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నామని వారి వారసులు చెబుతున్నారు. ఈ వేడుకల సమయంలో గ్రామస్థులు తమ పూర్వీకుల బలిదానాలు, త్యాగాలతో పాటు వారి వీరోచిత పోరాటాలను గుర్తు చేసుకుంటారు.

ABOUT THE AUTHOR

...view details