రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన కారు.. 20 మీటర్ల దూరం ఎగిరిపడ్డ యువతి - కర్ణాటక బెంగళూరులో కారు ప్రమాదం న్యూస్
కర్ణాటక బెంగళూరులో రోడ్డు దాటుతున్న స్వాతి(21) అనే విద్యార్థినిని ఓ కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. కారు ఢీ కొట్టడం వల్ల ఆమె 20 అడుగుల దూరం గాల్లోకి ఎగిరి పడి.. రోడ్డుపై దొర్లుకుంటూ వెళ్లింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఒక మెట్రో పిల్లర్ నుంచి మరో పిల్లర్ వరకు దొర్లుకుంటూ వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలలో నమోదయ్యాయి. తీవ్ర గాయాలపాలైన యువతి.. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతుంది. స్వాతి తల్లిదండ్రులు ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు.. కారు నడిపిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్ఆర్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న నిందితుడు కృష్ణభార్గవ్ ప్రమాదం తర్వాత పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఫిబ్రవరి 2వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.