తెలంగాణ

telangana

Hit and Drag Case in Bengaluru

ETV Bharat / videos

డెలివరీ బాయ్​ను ఢీకొట్టి 100మీ లాక్కెళ్లిన కారు డ్రైవర్.. అక్కడికక్కడే మృతి.. కి.మీ ఛేజ్ చేసి మరీ.. - డెలివరీ బాయ్​ను ఢీకొట్టి లాక్కెళ్లిన కారు డ్రైవర్

By

Published : Jun 19, 2023, 12:24 PM IST

ఫుడ్​ డెలివరీ బాయ్​ను ఢీకొట్టి 100 మీటర్లు లాక్కెళ్లాడు ఓ కారు డ్రైవర్. ఈ ప్రమాదంలో బైక్​పై వెళ్తున్న యువకుడు అక్కడిక్కడే మరణించాడు. ఈ ఘటన కర్ణాటక బెంగళూరులోని ఆర్​ఆర్​ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో జరిగింది. అనంతరం కారును ఆపకుండా కిలోమీటర్​ దూరం పారిపోయాడు. దీనిని గమనించిన స్థానికులు.. అతడిని వెంబడించి పట్టుకున్నారు.  

ఇదీ జరిగింది..
విజయనగర్​కు చెందిన వినాయక్.. రాజాజీ నగర్​లోని ఓ కార్ల షోరూంలో సేల్స్ ఎగ్జ్​క్యూటివ్​గా పనిచేస్తున్నారు. అయితే, ఆయనకు ఇటీవలే ఇన్సెంటివ్​ రావడం వల్ల ఆదివారం స్నేహితులకు పార్టీ ఇచ్చారు. పార్టీలో మద్యం సేవించిన వినాయక్​.. తన స్నేహితులతో కలిసి కారులో బయలుదేరాడు. మద్యం మత్తులో ఉన్న వినాయక్​.. ఆర్​ఆర్ నగర్ మెట్రో సమీపంలో బైక్​పై వెళ్తున్న ఓ పుడ్ డెలివరీ బాయ్​ బైక్​ను వెనుక నుంచి ఢీకొట్టాడు. ఆ తర్వాత 100 మీటర్లు లాక్కెళ్లాడు. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మరణించాడు. 

అనంతరం అక్కడి నుంచి వినాయక్​.. పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అతడిని గమనించిన స్థానికులు కిలోమీటర్ వెంబడించి పట్టుకున్నారు. వినాయక్​ దొరకగా.. కారులో ఉన్న ముగ్గురు యువతులు, ఒక యువకుడు తప్పించుకున్నారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు.. కారును ధ్వంసం చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వినాయక్​ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడికి పరీక్షలు చేయగా అతిగా మద్యం తాగాడని తేలింది. దీంతో అతడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.  

ABOUT THE AUTHOR

...view details