తెలంగాణ

telangana

Truck overturned on road accident live video in shimla

ETV Bharat / videos

Lorry Accident Live Video : 3 కార్లపైకి దూసుకెళ్లిన యాపిల్ లారీ.. భార్యాభర్తలు మృతి - Shimla lorry accident august 8th

By

Published : Aug 9, 2023, 3:48 PM IST

Himachal Pradesh Lorry Accident Live Video : హిమాచల్ ​ప్రదేశ్​లో సిమ్లా జిల్లాలో యాపిల్ లారీ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ధియోగ్​ఛైలా రోడ్డుపై మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. వాహనం అదుపు తప్పి ఎదురుగా ఉన్న మూడు కార్ల, బైక్​ను ఢీకొట్టింది. ఓ కారులో ఉన్న దంపతులు ఈ దుర్ఘటనలో మృతి చెందారు. మిగిలిన వాహనాలు తుక్కుతుక్కు అయ్యాయి. అందులో ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న పోలీసులు  వేంటనే రెండు జేసీబీల సాయంతో గంటపాటు శ్రమించి లారీని బయటకు తీశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. 
"యాపిల్స్​తో ఉన్న లారీ సోలన్​కు వెళ్లే సమయంలో  ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చనిపోయిన ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం థియోగ్​ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాం. ప్రమాదం గురించి మృతుల కటుంబసభ్యులకు సమాచారం అందించాం. లారీ రాంగ్ రూట్​లో రావటం, బ్రేక్ ఫెయిల్ అవ్వటం వల్ల ఈ ప్రమాదం జరిగింది." అని పోలీసుల తెలిపారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని థియోగ్ పోలీసులు తెలిపారు.   

ABOUT THE AUTHOR

...view details