తెలంగాణ

telangana

High_Court_Hearing_Chandrababu_Bail_Petition_in_Skill_Development_Case

ETV Bharat / videos

స్కిల్‌ కేసులో చంద్రబాబు ప్రధాన బెయిల్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ - తీవ్ర ఉత్కంఠ - చంద్రబాబు కేసు

By ETV Bharat Telugu Team

Published : Nov 10, 2023, 6:53 AM IST

High Court Hearing Chandrababu Bail Petition in Skill Development Case :స్కిల్‌ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ప్రధాన బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ జరపనుంది. నిందితులందరూ ఇప్పటికే రెగ్యులర్‌, ముందస్తు బెయిలు పొందడం.. ఇదేకేసులో 37వ నిందితుడైన చంద్రబాబుకి బెయిల్‌ దక్కకపోవడంపై న్యాయవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రధాన నిందితులు బెయిల్‌ పొందాక మిగిలిన నిందితులకు బెయిలు దక్కడం సాధారణమని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

నైపుణ్యాభివృద్ధి సంస్థ పూర్వ ఎండీ, మొదటి నిందితుడు గంటా సుబ్బారావుతో పాటు మిగిలిన నిందితులందరూ ఇప్పటికే బెయిలు పొందారు. సీమెన్స్‌ కంపెనీ (Siemens Company) సీనియర్‌ డైరెక్టర్‌గా పనిచేసిన భాస్కర్‌ (Bhaskar)కు సైతం సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ముందస్తు బెయిల్‌ను తాజాగా పూర్తిస్థాయి బెయిలుగా మార్చింది. ఇదే కేసులో 35వ నిందితురాలిగా ఉన్న IAS అధికారి అపర్ణకు సైతం హైకోర్టు ముందస్తు బెయిలు ఇచ్చింది.

Cases on TDP Chief Chandrababu Naidu:నైపుణ్యాభివృద్ధి సంస్థకు చెందిన నిధుల దుర్వినియోగం ఆరోపణలతో 2021 డిసెంబర్‌ 9న సీఐడీ నమోదు చేసిన కేసులో అందరు నిందితులకు దిగువ, హైకోర్టు, సుప్రీంకోర్టు ఉపశమనం కలిగించాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నమోదు చేసిన కేసులోనూ డిజైన్‌టెక్‌ సంస్థకు చెందిన వారు బెయిలు పొందారు. 

చంద్రబాబుకు మాత్రం ఊరట లభించకపోవడం న్యాయవర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. ఇప్పటికే కేసుకు సంబంధించిన సాక్ష్యాల సేకరణ, వాంగ్మూలాల నమోదు, మిగిలిన నిందితులందరూ బెయిలుపై బయట ఉండి దర్యాప్తునకు సహకరిస్తున్నారని పేర్కొంటున్నారు. ఈ కేసులో అనారోగ్య కారణాలతో చంద్రబాబుకు.. హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. శుక్రవారం ప్రధాన బెయిలు పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో న్యాయవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details