'హాయ్ నాన్న' సక్సెస్ సెలబ్రేషన్స్ - కేక్ కట్ చేసి, గాల్లోకి బెలూన్స్ ఎగరేసిన నాని - హాయ్ నాన్నసినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్
Published : Dec 7, 2023, 10:08 PM IST
HI Nanna Movie Success Celebration :నేచురల్ స్టార్ నాని - మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన చిత్రం హాయ్ నాన్న. డైరెక్టర్ శౌర్యువ్, తండ్రీ కుమార్తె మధ్య ఎమోషన్స్‌తో కథాంశంతో తెరకెక్కించారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి నిర్మించారు. ఇక ఈ సినిమా నేడు (డిసెంబర్ 7న) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ విజయాన్ని పురస్కరించుకొని, గురువారం వైరా నిర్మాణ సంస్థ కార్యాలయంలో మూవీటీమ్ సక్సెస్ సంబరాలు చేసుకుంది. ఈ సెలబ్రేషన్స్‌కు హీరో నాని హాజరయ్యారు. 'తెలుగు ప్రేక్షకులు మా సినిమాకు బ్రహ్మారథం పడుతున్నారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న సందేశాలు చూస్తుంటే భావోద్వేగానికి గురవుతున్నా' అని నాని అన్నారు. ఇక కార్యక్రమంలో నాని, దర్శక నిర్మాతలు చిత్ర బృందంతో కలిసి కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం గాల్లోకి రంగురంగుల బెలూన్స్ ఎగురవేసిన నాని ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.