'చందమామ' వచ్చింది.. ఓరుగల్లు నవ్వింది..
Heroine Kajal Aggarwal: వరంగల్‌లోని హనుమకొండలో ప్రముఖ సీనీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సందడి చేసింది. నగరంలోని పబ్లిక్ గార్డెన్ వద్ద ఏర్పాటు చేసిన నెంబర్ వన్ షాపింగ్ మాల్‌ను ఆమె ప్రారంభించింది. ఆనంతరం మాల్ లో కలియ తిరుగుతూ పలు వస్త్రాలను ఆసక్తిగా తిలకించింది. పలు వస్త్రాలను ధరించి సందడి చేసింది. హీరోయిన్ని చూడటానికి అభిమానులు తరలివచ్చారు.సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు. వరంగల్ కు రావడం చాలా ఆనందంగా ఉందని హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలిపారు. మీ అభిమానుల అభిమానాలు ఎల్లపుడూ నాపై ఉండాలని కోరారు. అనంతరం స్టేజీపై నిల్చోని అభిమానులను ఉత్సాహపరిచారు.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST