Hero Vijay Deverakonda: ఐస్‌క్రీమ్ సెంటర్లో సందడి చేసిన హీరో విజయ్ దేవరకొండ - తెలంగాణ తాజా వార్తలు
Hero Vijay Deverakonda visit the icecream store: హైదరాబాద్ కొండాపూర్‌లోని ఓ ఐస్‌క్రీమ్ స్టోర్‌లో రౌడీహీరో విజయ్ దేవరకొండ సందడి చేశారు. క్రీమ్‌స్టోన్ స్టోర్‌లో సమ్మర్ స్పెషల్ ఐస్‌క్రీమ్ ఫ్లేవర్స్‌ను ఆయన ఆవిష్కరించారు . తన పుట్టినరోజు సందర్భంగా సరికొత్త ఐస్‌క్రీమ్ ఫ్లేవర్స్‌ను ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. క్రీమ్‌స్టోన్ సెంటర్ నిర్వాహకులు.. సమ్మర్ స్పెషల్‌గా క్రీమ్‌స్టోన్ వీడీకే పేరుతో సరికొత్త ఐస్‌క్రీమ్ ఫ్లేవర్స్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. మ్యాంగో, ముంజ ఫ్లేవర్ ఐస్‌క్రీమ్‌లను తీసుకొచ్చినట్లు నిర్వహకులు ఫ్రాంక్లిన్ తెలిపారు. ప్రతి సంవత్సరం కొత్త కొత్త ఫ్లేవర్స్‌లో కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఐస్క్రీమ్స్లను తీసుకువస్తున్నట్లు వివరించారు. విజయ్ దేవరకొండను చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అభిమానుల కేరింతలు, కోలాహాలతో అక్కడి వాతావరణమంతా సందడిగా మారింది. మంగళవారం విజయ్ పుట్టినరోజు సందర్బంగా అభిమానుల నడుమ ప్రత్యేకంగా తయారు చేసిన కేక్‌ను కట్ చేశారు. అనంతరం చిన్నారులతో సెల్ఫీలు దిగారు. పలువురు మోడల్స్ పాల్గొని ఫోటోలకు ఫోజులిచ్చారు.