తెలంగాణ

telangana

Hero Manchu Manoj Initiate Namasthe World

ETV Bharat / videos

పిల్లలకు ఇండియా గొప్పతనం తెలిసేలా నమస్తే వరల్డ్ టాయ్స్​ తీసుకొస్తున్నాం : మంచు మనోజ్ - మంచు మనోజ్ స్పీచ్ నమస్తే వరల్డ్ గురించి

By ETV Bharat Telangana Team

Published : Dec 26, 2023, 8:16 PM IST

Updated : Dec 26, 2023, 10:52 PM IST

Hero Manchu Manoj Initiate Namasthe World :భారతీయ పురాణాలు, ఇతిహాసాల్లోని సూపర్ హీరోలను బొమ్మలుగా తయారు చేసి పిల్లల్లో స్ఫూర్తి నింపేందుకు, నమస్తే వరల్డ్ పేరుతో ప్రత్యేకంగా అంకుర సంస్థను మొదలుపెట్టినట్లు ప్రముఖ కథానాయకుడు మంచు మనోజ్ తెలిపారు. తన సతీమణి భూమ మౌనికారెడ్డి సీఈవోగా వ్యవహరిస్తున్న నమస్తే వరల్డ్ ద్వారా దేశంలోని గొప్ప సంస్కృతిని, కళలను ఆవిష్కరించి ప్రపంచానికి చూపించబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్​లోని ప్రసాద్ ఐమ్యాక్స్ ఆవరణలో నమస్తే వరల్డ్ బ్రాండ్ టాయ్స్​ను మనోజ్ దంపతులు లాంఛనంగా ఆవిష్కరించారు.

Manchu Manoj Speech at Namaste World Launch :దేశ నలుమూలల నుంచి సేకరించిన ఉత్పత్తులతో మేడ్ ఇన్ ఇండియా నినాదంతో తమ సంస్థ నుంచి బొమ్మలు తయారవుతాయని మనోజ్ వివరించారు. ఇంట్లో చిన్నారులు సృజనాత్మకంగా గీసిన బొమ్మలను తమ వెబ్​సైట్​లో అప్లోడ్​ చేస్తే వాటికి రూపమిచ్చి పంపిస్తామని, యానిమేషన్, గేమింగ్​లోనూ ప్రాచుర్యం కల్పిస్తామని మనోజ్ ప్రకటించారు. నాలుగేళ్ల నుంచి నమస్తే వరల్డ్ కోసం మౌనిక ఎంతో శ్రమించిందని తెలిపారు. విదేశాల నుంచి కాకుండా స్వదేశంలోనే మనకు నచ్చిన సూపర్ హీరోలను తయారుచేసుకోవచ్చని మనోజ్ వివరించారు.  

Last Updated : Dec 26, 2023, 10:52 PM IST

ABOUT THE AUTHOR

...view details