మద్యం దుకాణాల సమీపంలో ఏనుగుల గుంపు హల్చల్.. అందుకే వచ్చాయా? - herd of elephants threat in Uttarakhand
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. రాత్రి సమయంలో లక్సర్ రోడ్‌లోని మద్యం దుకాణాల సమీపంలో హల్చల్ చేసింది. అటవీ అధికారులకు సమాచారం అందించారు స్థానికులు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు.. ఏనుగులను అడవుల వైపు చెదరగొట్టారు. ఏనుగుల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతంలో నిరంతరం పెట్రోలింగ్ చేస్తున్నట్లు వారు వెల్లడించారు. ఈ ప్రాంతంలో చెరుకు తోటలు ఎక్కువగా ఉన్న కారణంగా ఏనుగులు వస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST