తెలంగాణ

telangana

Heavy Traffic Jam in Hyderabad

ETV Bharat / videos

పెట్రోల్​ బంకుల ముందు బారులు తీరిన జనం - హైదరాబాద్​లోని పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ - no petrol in hyderabad

By ETV Bharat Telangana Team

Published : Jan 2, 2024, 6:20 PM IST

Heavy Traffic Jam in Hyderabad : హిట్‌ అండ్‌ రన్‌ కేసుల విషయంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనను వ్యతిరేకిస్తూ ఆయిల్​ ట్యాంకర్ల డ్రైవర్లు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఫలితంగా నగరంలోని పలు బంకుల్లో పెట్రోల్ లేక నో స్టాక్​ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన వాహనదారులు పెట్రోల్​, డీజిల్​ కోసం బంకుల ముందు బారులు తీరారు. మీటర్ల మేర లైన్లు కట్టడంతో ఆయా మార్గాల్లో ట్రాఫిక్​ స్తంభించింది.

నగరంలోని నారాయణగూడ, బషీర్​బాగ్, హైదర్​గూడ, లక్డీకపూల్​, అబిడ్స్ పెట్రోల్ బంక్ పరిసర ప్రాంతాల్లో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ నుంచి లక్డీకపూల్‌ వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్​ ఏర్పడింది. సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మెహదీపట్నం నుంచి లక్డీకపూల్ వెళ్లే మార్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. మరోవైపు ట్యాంకర్ల డ్రైవర్లు ధర్నా విరమించడంతో ట్రాఫిక్​ పోలీసులు రంగంలోకి దిగారు. వాహనదారులను నియంత్రిస్తున్నప్పటికీ పరిస్థితి అదుపులోకి రావడం లేదు. ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు ధర్నా విరమించారని, గంటలోపు యధావిధిగా పెట్రోల్​ దొరుకుతుందని, వాహనదారులు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details