Heavy Traffic Jam at Lulu Mall : లులూ మాల్‌కు పొటెత్తిన ప్రజలు.. భారీగా ట్రాఫిక్ జామ్ - Heavy traffic jam at Lulu Mall latest news
Published : Oct 1, 2023, 10:10 PM IST
Heavy Traffic Jam at Lulu Mall in Hyderabad : హైదరాబాద్ కూకట్పల్లి పరిసర ప్రాంతాల ప్రజలు.. ట్రాఫిక్ సమస్యతో అవస్థలు పడుతున్నారు. జేఎన్టీయూ వంతెన వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన లులూ మాల్ (Lulu Mall) వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆదివారం కావడంతో ఆ మాల్‌ను సందర్శించేందుకు ప్రజలు పొటెత్తారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గత ఐదు రోజులుగా మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలుకొని.. సుమారు రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్‌తో నానాపాట్లు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు.
Kukatpally Traffic Jam Today :సాయంత్రం పూట హైటెక్‌సిటీ నుంచి జేఎన్టీయూ వైపు.. హైదరాబాద్ నుంచి మియాపూర్ వైపుగా వచ్చేందుకు.. ట్రాఫిక్‌లో ఇరుక్కుని నానా కష్టాలు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలిసి చాలా మంది కనీసం ఇంటిలో నుంచి బయటకు వచ్చేందుకు భయపడాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. ఆ మాల్ నిర్వాహకులతో చర్చించాలని అంటున్నారు. తదనగుణంగా సరైన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు.. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టారు.