తెలంగాణ

telangana

Heavy Rains in Jagtial District

ETV Bharat / videos

Heavy Rains in Korutla Jagtial District : నీటమునిగిన కోరుట్ల.. జేసీబీతో వాహనాలను బయటకు తీస్తున్న పురపాలక అధికారులు - జగిత్యాల జిల్లాలో వర్షాలు

By ETV Bharat Telangana Team

Published : Sep 4, 2023, 4:59 PM IST

Heavy Rains in Jagtial District :జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కోరుట్లలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చుట్టుపక్కల ఉన్న వాగుల ఉధృతికి భారీగా వరద నీరు చేరడంతో పంట పొలాలు సైతం నీటి మునిగాయి. తాత్కాలిక రహదారుల(Temporary Roads) వద్ద రోడ్డు కోతకు గురై రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. 

Rain Effect In Korutla : పట్టణంలోని ఆదర్శనగర్, ప్రకాశం రోడ్డు, కల్లూరు రోడ్డు, ఝాన్సీ రోడ్ తదితర ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తడంతో ఇక్కడి కాలనీలోని పలు ఇళ్లు సగం వరకు మునిగిపోయాయి. ఈ కాలనీలా పక్కనే చెరువులు ఉండడంతో.. చెరువులు పొంగిపొర్లి వరద నీరంతా ఈ కాలనీల్లో వీదుల్లోకి చేరాయి. మోకాళ్లలోతు నీరు చేరడంతో కాలనీ ప్రజలు నానా అవస్థలు పడ్డారు. భారీ వర్షాలు ఉన్నాయని తెలుసుకున్న పలువురు కుటుంబీకులు ఇంటికి తాళాలు వేసి బంధువుల ఇంటికి ముందస్తుగా చేరుకున్నారు. ఇళ్ల ముందు ఉన్న కార్లు నీటిలో కొట్టుకుపోకుండా ఉండేందుకు పురపాలక అధికారులు జేసీబీ సహాయంతో వాహనాలను బయటకు తీసుకువచ్చారు. అలాగే ఎవరికి ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details