తెలంగాణ

telangana

Hyderabad

ETV Bharat / videos

Heavy Rains in Hyderabad : హైదరాబాద్​లో దంచికొట్టిన వర్షం.. రోడ్లన్నీ జలమయం - హైదరాబాద్​లో వర్షాలు

By ETV Bharat Telangana Team

Published : Sep 14, 2023, 7:53 PM IST

Heavy Rains in Hyderabad :హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. భారీగా కురిసిన వానతో నగర వాసులు(Hyderabad Rains) తడిసి ముద్దయ్యారు. కొద్ది సేపు కురిసిన వర్షానికే రోడ్డుపైకి భారీగా వర్షపు నీరు చేరింది. ఈదురు గాలులు, ఉరుములతో కురిసిన వర్షానికి వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌, కూకట్‌పల్లి, ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ, చింతల్, సుచిత్ర, సూరారం, నిజాంపేట, షేక్‌పేట, రాయదుర్గం, నాంపల్లి, ముషీరాబాద్, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, రాంనగర్‌, దోమలగూడ, కవాడిగూడ, మాదాపుర్, గచ్చిబౌలి, కొండాపుర్‌లో వర్షం కురిసింది. 

అలాగే నారాయణ గూడ, హిమాయత్‌ నగర్, కోఠి, బేగంబజార్, బషీర్‌బాగ్‌, లకిడికపూల్‌, బహదూర్‌పుర, చార్మినార్, బార్కస్, ఫలక్‌నుమ, చంపాపేట, సైదాబాద్, సరూర్‌నగర్, చైతన్యపురి, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. మరోవైపు పలు చోట్ల నాలాలు పొంగిపోర్లడంతో రోడ్లు చెరువులను తలపించాయి. మోకాళ్ల లోతు రహదారులపై వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్ అంతరాయం(Huge Traffic in Hyderabad) ఏర్పడి.. విద్యార్థులు, ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. కుండపోత వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయగా.. ప్రజలకు అధికారులు పలు సూచనలు చేశారు. 

ABOUT THE AUTHOR

...view details