భారీ వర్షాలు.. అంతస్తు మేర మునిగిన అపార్ట్మెంట్.. రంగంలోకి NDRF!
Heavy Rains In Punjab : హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. నదులు, వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పంజాబ్‌లోని హోషియార్‌పుర్‌లో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పంజాబ్ మొహలీలోని డేరా బస్సీ గుల్‌మోహర్ సొసైటీలో దాదాపు ఒక అంతస్తు మేరకు వరద నీరు చేరింది. సెల్లార్లలో పార్కింగ్ చేసిన వాహనాలన్నీ నీట మునిగాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.
Heavy Rains In Haryana : హరియాణాలో పలు చోట్ల భారీ వర్షం కురవడం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని చండీగఢ్‌లోని సుఖ్నా సరస్సులోకి భారీగా వరద నీరు చేరుతోంది. అధికారులు గేట్లు తెరిచి నీటిని కిందకు వదులుతున్నారు. పంచకుల, యమునానగర్, అంబాలా, కర్నాల్, కురుక్షేత్ర, సోనిపట్‌లలో భారీ వర్షాలు కురిశాయి. పలుచోట్ల ఇళ్లలోకి చేరిన నీటితో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురువుతున్నారు.