Hanamkonda Rains Drone Visuals : హనుమకొండను ముంచెత్తిన వరద.. డ్రోన్ విజువల్స్ ఇవిగో - Heavy rains in Hanamkonda latest news
Heavy Rains in Hanamkonda District : హనుమకొండ జిల్లాలో వర్షం దంచికొడుతోంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముంపు గుప్పిట్లో హనుమకొండలోని కాలనీలు చిగురుటాకులా వణుకుతున్నాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు.. బుధవారం రాత్రి కురిసిన భారీ వానతో లోతట్టు ప్రాంతాలే కాకుండా అనేక కాలనీలు జలమయమయ్యాయి. అర్ధరాత్రి వరద ముంచెత్తుండటంతో ముంపు ప్రాంతాలకు చెందిన వారిని అప్పటికప్పుడు పునరావాసాలకు తరలించారు. ఇళ్ల నుంచి కట్టుబట్టలతో బయటికి వచ్చిన బాధితులు.. ఉదయం నీట మునిగిన ఇళ్లు, వస్తువులను చూసి కన్నీరుమున్నీరయ్యారు. మరోవైపు నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో పొంగుతున్న వరద కారణంగా పలుచోట్లకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆత్మకూరు మండలం కటాక్షపూర్ చెరువు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ములుగు వైపునకు వెళ్లే జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. కమలాపూర్ పోలీస్‌స్టేషన్‌లోకి వరద నీరు చేరింది. సీఐ, ఎస్సై గదుల్లోకి నీరు రావడంతో.. సిబ్బంది బకెట్లతో ఎత్తిపోశారు. హనుమకొండ తాజా పరిస్థితిని కళ్లకు కట్టే డ్రోన్ విజువల్స్ మీరూ చూసేయండి.