తెలంగాణ

telangana

Kinnerasani Dam

ETV Bharat / videos

Kinnerasani Project Floods News : నిండుకుండలా కిన్నెరసాని.. 12 గేట్లు ఎత్తి నీటి విడుదల

By

Published : Jul 27, 2023, 6:21 PM IST

Kinnerasani project Water Level : వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాల్వంచలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కిన్నెరసాని పూర్తి సామర్థ్యం 407 అడుగులు కాగా.. ప్రస్తుతం 403 అడుగుల వరకు వరద నీరు వచ్చి చేరింది. ఇన్ ఫ్లో 65 వేల క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో లక్ష క్యూసెక్కుల నీటిని 12 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ఒక్కసారిగా 12 గేట్లు ఎత్తడంతో కిన్నెరసాని పరివాహక ప్రాంతాలను అధికారులు రెడ్ అలర్ట్​గా ప్రకటించారు. కొత్తగూడెం నుంచి భద్రాచలం వైపు వెళ్లే ప్రధాన రహదారులపై వరద నీరు ప్రవహిస్తుండటంతో 24 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే కిన్నెరసాని డ్యామ్​పై నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. కిన్నెరసాని డ్యామ్ ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details