తెలంగాణ

telangana

ETV Bharat / videos

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం, కూకట్​పల్లి పరిధిలో భారీగా ట్రాఫిక్ జామ్ - తెలంగాణ వర్షాలు

🎬 Watch Now: Feature Video

Hyderabad Rains Today

By ETV Bharat Telangana Team

Published : Nov 8, 2023, 9:18 PM IST

Updated : Nov 8, 2023, 9:46 PM IST

Heavy Rain in Hyderabad Today : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం(Rain) పడింది. మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్, కూకట్‌పల్లి, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, హైదర్‌నగర్, ఆల్విన్‌కాలనీ, నిజాంపేట్‌ ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈ ప్రాంతాలతో పాటు ప్రగతినగర్, బాచుపల్లి, ముసాపేట్ ప్రాంతాల్లో కూడా వర్షం పడింది. కేపీహెచ్‌బీ వద్ద రహదారిపై నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది. కుకట్‌పల్లి( Kukatpally)లో సుమారు రెండు కిలోమీటర్లు వరకు వాహనాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. రహదారిపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.  
Traffic in Kukatpally Today : కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాలైన సూరారం, బహదూర్ పల్లి, సుచిత్ర, కొంపల్లి, చింతల్, బాలానగర్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు రహదారులు జలమయమైయ్యాయి. సాయంత్రం సమయం వర్షం పడడం వల్ల ఉద్యోగస్థులు, పని చేసుకున్న వ్యక్తులు ఇబ్బంది పడ్డారు. మంగళవారం కూడా సాయంత్రం భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో వర్షం పడడంతో పనికి వెళ్లి వస్తున్న వ్యక్తులు ఇక్కట్లు పడ్డారు.

Last Updated : Nov 8, 2023, 9:46 PM IST

ABOUT THE AUTHOR

...view details