తెలంగాణ

telangana

Heavy rain

ETV Bharat / videos

Hyderabad Rains: హైదరాబాద్‌లో మరోసారి దంచికొట్టిన వాన.. రోడ్లన్నీ జలమయం - Hail showers

By

Published : May 1, 2023, 8:07 PM IST

Heavy rains in Hyderabad: హైదరాబాద్‌లోని పలుచోట్ల ఇవాళ సాయంత్రం కుండపోత వర్షంతో వరుణుడు మరోసారి విరుచుకుపడ్డాడు. నగరంలోని చాంద్రాయణగుట్ట, బార్కస్, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, ఉప్పుగూడా తదితర ప్రాంతాల్లో కురిసిన కుండపోత వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. సంతోశ్​నగర్‌, సైదాబాద్, సరూర్‌నగర్‌, సికింద్రాబాద్‌, చిలకలగూడ, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, తిరుమలగిరి, అల్వాల్, రాణిగంజ్ ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో అక్కడక్కడ భారీ హోర్డింగ్‌లు నేలకొరిగాయి. రోడ్డుపై మోకాలు లోతులో వర్షం నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. సాయంత్రం వేళ కావడంతో ట్రాఫిక్​ స్తంభించి ఎక్కడికక్కడ వాహనాలు బారులుతీరాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దుండిగల్, బహదూర్‌పల్లి, గండిమైసమ్మ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి విద్యుత్‌ సరఫరా ఆగిపోయింది. వాటితో పాటుగా అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, రాజేంద్రనగర్, అత్తాపూర్, కిస్మత్‌పురాతో పాటు గండిపేట్, శంషాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. సుచిత్ర, జీడిమెట్ల, సూరారంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. రోడ్లపై వర్షం నీరు ప్రవహించడంతో చిన్న చిన్న కాలువలను తలపించాయి.

ABOUT THE AUTHOR

...view details