తెలంగాణ

telangana

మార్గదర్శి కేసు

ETV Bharat / videos

Maragadarshi Chit Case: మార్గదర్శి వ్యాజ్యాలపై విచారణ బుధవారానికి వాయిదా..

By

Published : Aug 9, 2023, 8:30 AM IST

Maragadarshi Chit Case in AP High Court: ప్రభుత్వ వెబ్‌సైట్లో ఉంచిన చిట్‌ గ్రూపుల విషయంలో అభ్యంతరాలు తెలపాలని చందాదారులను కోరుతూ చిట్స్‌ రిజిస్ట్రార్‌ జులై 30న ఇచ్చిన బహిరంగ నోటీసును సవాలు చేస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ బుధవారానికి వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.జయసూర్య మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. ఈ వ్యాజ్యాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌ మంగళవారం  ప్రతివాదనలు వినిపించాల్సి ఉంది. అదే సమయంలో ఏజీ మరో కోర్టులో వాదనలు వినిపిస్తున్నందున మార్గదర్శి వ్యాజ్యాలపై విచారణను బుధవారానికి వాయిదా వేయాలని ఆయన తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్‌ కోరారు. దీంతో న్యాయమూర్తి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వెబ్‌సైట్లో ఉంచిన చిట్‌ గ్రూపుల విషయంలో అభ్యంతరాలు తెలపాలని చందాదారులను కోరుతూ చిట్స్‌ రిజిస్ట్రార్‌ జులై 30న ఇచ్చిన బహిరంగ నోటీసు.. దాని ఆధారంగా చిట్‌ గ్రూపుల నిలిపివేతను సవాలు చేస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థ ఆథరైజ్డ్‌ రిప్రజెంటేటివ్‌ పి.రాజాజీ హైకోర్టును ఆశ్రయించారు. 

ABOUT THE AUTHOR

...view details