Harishrao Comments On AP Govt : 'ఆంధ్రప్రదేశ్ పాలకులకు మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ' - సీఎం కేసీఆర్
Harish Rao Criticism Of AP Govt : ఆంధ్రప్రదేశ్ పాలకులకు మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ అని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని.. ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ది ప్రచారం తక్కువ పని ఎక్కువ అని.. కాని ఏపీలో నాయకులు మాత్రం ప్రచారం ఎక్కువ పని తక్కువ అని విమర్శలు గుప్పించారు. ఆ రాష్ట్ర పాలకుల తీరువల్లే ఈరోజు ఏపీ వెల్లకిలా పడిందని విమర్శించారు.
నాటి పాలకులు తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం వస్తుందని.. హైదరాబాద్‌లో రోజూ కర్ఫ్యూ ఏర్పాటు చేయాలని ఎగతాళి చేశారని గుర్తు చేశారు. వీరికి పరిపాలన చేతకాదు.. కేవలం ఉద్యమం తప్ప అని అన్నారు. విద్యుత్ ఉండదు.. నిరుద్యోగం తాండవిస్తుందన్నారు. కాని ఈరోజు తెలంగాణ ఆ మాటలు అన్నింటిని పటాపంచలు చేస్తూ దేశానికే దిక్సూచిగా నిలుస్తోందని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి చూడాలనుకుంటే.. పక్క రాష్ట్రం వెళ్లి చూడాలని పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి హరీశ్‌రావు చురకలు అంటించారు. అనంతరం ఆయన హైదరాబాద్ కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీ కాలనీలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.