Harish Rao Latest Video : డ్రైనేజీలో చెత్తను చేతితో తీసిన హరీశ్ రావు - Siddipet District News
Harishrao on swachha telangana : 'నడకతో ఆరోగ్యం, చెత్త ఎరివేతతో స్వచ్ఛ పట్టణం' అంటూ మరో సంస్కరణకు సిద్ధిపేట మున్సిపాలిటీ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు జిల్లాలో నిర్వహించిన చెత్త ఏరివేత కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని నడుస్తూ చెత్త ఏరారు. "మన చెత్త- మన బాధ్యత" అంటూ ప్రచారం చేశారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించాలని.. స్వచ్ఛ తెలంగాణగా మారాలని కోరారు. చెత్త పెరుకుపోతే కలిగే అనర్థాలపై గృహిణీలకు అవగాహన కల్పించారు. మురికి కాల్వల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ కవర్లు, శానిటరీ చెత్తను మంత్రి హరీశ్‌రావు స్వయంగా ఎత్తి సంచిలో వేశారు.
మరోవైపు ప్రతిరోజు యోగా చేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటామని.. మానసిక ఒత్తిడి తొలిగిపోయి జీవితకాలం పెరుగుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. జిల్లాలోని ఓ పాఠశాలలో నిర్వహించిన ఆనంద యోగా క్యాంపు కార్యక్రమానికి హాజరై 100 మంది సాధకులకు మ్యాట్‌లు పంపిణీ చేశారు. అలాగే పట్టణంలోని వార్డు వారీగా 10 రోజులు ఉచిత యోగా శిబిరం నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు.