తెలంగాణ

telangana

Harish Rao on BRS Manifesto

ETV Bharat / videos

Harish Rao on BRS Manifesto : 'బీఆర్​ఎస్​ మేనిఫెస్టో చూసి.. విపక్షాల గుండెలు బేజారు' - బీఆర్​ఎస్​ మేనిఫెస్టో

By ETV Bharat Telangana Team

Published : Oct 16, 2023, 7:42 PM IST

Harish Rao on BRS Manifesto :బీఆర్​ఎస్​ మేనిఫెస్టోను చూసి.. విపక్షాల గుండెలు జారిపోయాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఒక కుటుంబ పెద్దగా ఆలోచించిన కేసీఆర్‌.. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో రూపొందించారన్నారు. నేడు రాష్ట్రంలో అర్హులైన 44 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్నామన్నారు. కేసీఆర్​ ఇచ్చిన మాట తప్పరని.. ప్రజల గురి ముఖ్యమంత్రిపైనే ఉందన్నారు. 

Harish Rao Fires on Congress :తమ పథకాలను కాపీ చేశారంటున్న రేవంత్​రెడ్డి.. బీఆర్​ఎస్​ ప్రవేశపెట్టిన రైతుబంధు, దళితబంధు, ఫించన్లను కాపీ కొట్టి కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పెట్టుకున్నారని దుయ్యబట్టారు. నేడు రాష్ట్రంలో ఎలాంటి దరఖాస్తు పెట్టకుండానే రైతుబంధు నిధులు ఇస్తున్నామని.. ప్రతి ఇంటికి ధీమా కల్పించాలనే ఉద్దేశంతో కేసీఆర్‌ బీమా తీసుకొస్తున్నట్లు తెలిపారు. మిషన్​ భగీరథతో.. మహిళలు దశాబ్దాల పాటు అనుభవించిన మంచినీటి కష్టాలు తీర్చింది కేసీఆర్‌ సర్కారేనని పేర్కొన్నారు. రేపు సిద్దిపేటలో జరగనున్న సీఎం కేసీఆర్ ప్రగతి ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. సభ ఏర్పాట్లపై నిర్వహకులకు పలు సూచనలు చేశారు. 

ABOUT THE AUTHOR

...view details