తెలంగాణ

telangana

Harish Rao

ETV Bharat / videos

Harish Rao Interesting Comments : 'కేసీఆర్‌ మళ్లీ సీఎం కాకపోతే.. హైదరాబాద్ మరో అమరావతి అవుతుంది' - Harish Rao criticism of BJP and Congress

By ETV Bharat Telangana Team

Published : Oct 28, 2023, 8:51 AM IST

Updated : Oct 28, 2023, 10:30 AM IST

Harish Rao Interesting Comments in Hyderabad :ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ రన్‌ ఔట్‌, బీజేపీ డక్‌ ఔట్‌ అవ్వడం ఖాయమని మంత్రి హరీశ్‌రావు (Harish Rao) జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ సెంచరీ కొడతారని వివరించారు. తెలంగాణలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కాకపోతే.. హైదరాబాద్ మరో అమరావతి అవుతుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ మళ్లీ రాకపోతే రియల్‌ ఎస్టేట్‌ పడిపోతుందని చెప్పారు. రాష్ట్రంలో భూగర్భజలాలు పెరిగాయని.. ధాన్యం ఉత్పత్తిలో  ప్రథమస్థానంలో ఉందని చెప్పారు. ఏటా 10,000 మంది డాక్టర్లను దేశానికి అందిస్తున్నామని అన్నారు. హైదరాబాద్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Bithiri Sathi Support for BRS : హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి దంపతులకు గులాబీ కండువా కప్పి హరీశ్‌రావు బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. బిత్తిరిసత్తి (Bithiri Sathi) అలియాస్‌ చేవెళ్ల రవి.. ఈ ఎన్నికల్లో భారత్‌ రాష్ట్ర సమితికి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. తలసరి ఆదాయంలో ప్రథమస్థానంలో ఉన్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్‌ ఖాతా కూడా తెరవదని.. ఇక్కడ గెలిచేది బీఆర్ఎస్, ఎంఐఎం అని ఆయన జోస్యం చెప్పారు. 

Last Updated : Oct 28, 2023, 10:30 AM IST

ABOUT THE AUTHOR

...view details