తెలంగాణ

telangana

Harish Rao

ETV Bharat / videos

ఆటో కార్మికులకు నెలకు 15 వేల జీవన భృతి ఇవ్వాలి : హరీశ్​ రావు - harish latest news

By ETV Bharat Telangana Team

Published : Jan 13, 2024, 1:21 PM IST

Harish Rao Fires On Congress In Siddipet : రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద ఆటో డ్రైవర్​లను రోడ్డుపై వదిలేశారని మాజీ ఎమ్మెల్యే హరీశ్​ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండి పడ్డారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచి కార్యక్రమమే అయినా ఆటో డ్రైవర్లకు నెలకొన్న సమస్యలను పరిష్కరించడం అంతే ముఖ్యమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్​ రావు మాట్లాడుతూ సిద్దిపేట సొసైటీలో 1483 సభ్యులు ఉన్నారని ఆటో కార్మికులు సొసైటీ ఏర్పాటు చేసుకోవడం రాష్ట్రానికి ఆదర్శమన్నారు. ఆటో కార్మికుల ఆలోచనలో మార్పు వచ్చిందని సిద్దిపేటకు బ్రాండ్ అంబాసిడర్​లు నిలిచారని ఆయన కితాబిచ్చారు. ఆటో కార్మికులను రోడ్డున పడేసింది ప్రభుత్వం వీరికోసం ఆలోచన చేసి నెలకు 15 వేల జీవన భృతి ఇవ్వాలని హరీశ్​ డిమాండ్ చేశారు. 

Harish Demands To 15 Thousand Allowance To Auto Drivers : మహిళలకు ఉచిత బస్ ప్రయాణం మంచి కార్యక్రమం, కానీ మారుమూల గ్రామాలకు మరిన్ని బస్ సౌకర్యాలు పెంచాలన్నారు. ప్రభుత్వం మంచి చేస్తూ ఇంకొకరి ఉసురు పోసుకోవడం సరైనది కాదన్నారు. కార్మికులను కాపాడే బాధ్యత ప్రభుత్వం పైన ఉందని ఆయన అన్నారు. అసెంబ్లీలో మీ సమస్యలపై చర్చించి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని హరీశ్​ స్పష్టం చేశారు. సిద్దిపేట అన్ని రకాల ఆటలకు నిలయంగా మారిందని మీ ఆరోగ్యం కాపాడుకునేందుకు సమయం దొరికితే ఆటలు ఆడండని ఆటో డ్రైవర్లను మాజీ మంత్రి హరీశ్​ రావు కోరారు.

ABOUT THE AUTHOR

...view details