Harish Rao Distributes BC Bandhu Cheques : బీసీ కులాలను ఆర్థికంగా ఆదుకుంటాం: హరీశ్ రావు - telangana latest news
Harish Rao Distributes BC Bandhu Cheque : సిద్దిపేట నియోజకవర్గంలో వెనుకబడిన తరగతులు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కుల వృత్తులను ప్రోత్సహించుటకై బీసీ బంధు చెక్కులను మంత్రి హరీష్ రావు లబ్ధిదారులకు అందజేశారు. బీసీ కులాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆర్థికంగా వారి ఎదుగుదల కోసo ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇస్తున్నామని పేర్కొన్నారు. వెనుకబడిన తరగతులు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కుల వృత్తులను ప్రోత్సహించుటకై పలు మండలాల్లోని 202 మంది లబ్ధిదారులకు చెక్కులు అందించారు.
కుల వృత్తులు రోజురోజుకు అంతరించి పోతున్నాయని... వారిని ఆర్థికంగా ఆదుకోవాలనే బీసీ బందు పథకం పెట్టామని హరీష్ తెలిపారు. గతంలో ఏ పథకం అయినా బ్యాంక్‌ల ద్వారా ఇచ్చేవారు కానీ కేసీఆర్ నేరుగా లబ్ధిదారులకే చెక్కులు అందిస్తున్నామన్నారు. నాయిబ్రాహ్మణులకు ఉచిత కరెంట్ అందిస్తున్నామని, గొల్ల కుర్మలకు గొర్రెలు, పద్మశాలీల మగ్గాలకు ప్రతి నెల మూడు వేల రూపాయలను చేనేత మిత్ర కింద అందిస్తున్నామన్నారు. రజకులకు మోడ్రన్ దోభీఘాట్ నిర్మించామన్నారు. ప్రతి మండలానికి బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేశామని తెలిపారు. సిద్దిపేటలో బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను ఈ ఏడాది ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.