Harish Rao at Gajwel Ring Road Opening : 'మూడు గంటలు కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలా.. మూడు పంటలు ఇచ్చే కేసీఆర్ కావాలా..?' - మంత్రి హరీశ్‌రావు గజ్వేల్ పర్యటన
Published : Oct 3, 2023, 3:35 PM IST
Minister Harish Rao at Gajwel Ring Road Opening : రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే ప్రజలకు తిప్పలు తప్పవని, గతంలో కాంగ్రెస్ హయాంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్న మంత్రి, రూ.306 కోట్లతో నిర్మించిన రింగ్ రోడ్డును ప్రారంభించారు. అనంతరం రూ.4 కోట్లతో ఏర్పాటు చేసిన పత్తి మార్కెట్ యార్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో రైతులు బతుకు దుర్భరమైనవిగా ఉండేవన్నారు.
కేసీఆర్ అధికారంలో వచ్చిన తర్వాత రైతులకు 24 గంటల కరెంటుతో పాటు.. రైతుబంధు పథకాన్నీ తీసుకువచ్చారని తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను కొని మద్ధతు ధర ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అన్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రైతే రాజు అన్న నినాదాన్ని నిజం చేశాడని తెలిపారు. మూడు పంటలు ఇచ్చే కేసీఆర్ కావాలో, మూడు గంటల విద్యుత్ చాలన్న కాంగ్రెస్ కావాలో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. పనిచేసే బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.
TAGGED:
gajwel cotton market opening